గోల్నాక: రాష్ట్ర వీల్‌చైర్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన టోర్నీలో ఆతిథ్య తెలంగాణ జట్టు విజేతగా నిలిచింది. మంగళవారం ఆంధ్రప్రదేశ్‌తో జరిగిన ఫైనల్లో తెలంగాణ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఏపీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 120 పరుగులు చేసింది. లక్ష్యఛేదనలో తెలంగాణ 14 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి విజయాన్నందుకుంది.
ఆటలో తాము ఎవరికీ తీసిపోమని నిరూపిస్తూ దివ్యాంగ క్రికెటర్లు అద్భుత ప్రదర్శన కనబరిచారు. బహుమతి ప్రదాన కార్యక్రమానికి పారిశ్రామికవేత్త స్వామిగౌడ్, ప్రముఖ సంఘ సేవకురాలు సిప్రా గాంధీ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.