కొచ్చి: కేరళ నుంచి తొలి మహిళా ఫార్ములావన్ రేసర్ దూసుకొచ్చింది. కోజికోడ్‌కు చెందిన సల్వా మార్జన్.. రేసింగ్‌లో అదరగొడుతున్నది. సరిగ్గా పదేండ్ల క్రితం రేసింగ్ కెరీర్ ప్రారంభించిన ఈ 25 ఏండ్ల యువ రేసర్ వచ్చే ఏడాది జనవరిలో జరిగే అంతర్జాతీయ రేసింగ్ సమాఖ్య(ఎఫ్ఐఏ) గుర్తింపు పొందిన రేసింగ్‌లో పోటీపడబోతున్నది. ప్రస్తుతం యూఏఈలో శిక్షణ తీసుకుంటున్న సల్వా ప్రస్తుతం ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నది. రేసింగ్‌లో మెరుగైన శిక్షణ కోసం అధిక మొత్తం ఖర్చు చేయాల్సి వస్తుండటంతో బిజినెస్ గ్రాడ్యుయేట్ అయిన సల్వా ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాలు చేయాల్సి వస్తున్నది.