లక్నో: రంజీ ట్రోఫీ సెమీస్‌లో కర్ణాటక భారీ స్కోరు చేసింది. ఉత్తరాఖండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో తొలిరోజే కేఎల్ రాహుల్, దేవ్‌దత్ పడిక్కల్ శతకాలతో పటిష్ట స్థితిలో నిలిచిన ఆ జట్టు.. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఏకంగా 689/6తో మ్యాచ్‌ను శాసించే స్థితికి చేరుకుంది. 355/2తో రెండో రోజు ఇన్నింగ్స్ ఆరంభించిన కెప్టెన్ పడిక్కల్ (ఓవర్ నైట్ స్కోరు 148).. అదే దూకుడును కొనసాగించి కెరీర్లో మొదటి డబుల్ సెంచరీ (232) పూర్తిచేశాడు.
స్మరణ్ రవిచంద్రన్ (121) శతకంతో కదం తొక్కగా కరుణ్ నాయర్ (60), కృతిక్ (60) రాణించారు. ఇక రెండో సెమీస్‌లో బెంగాల్‌తో ఆడుతున్న జమ్మూకశ్మీర్.. రెండో రోజు ఆట చివరికి 198/5తో నిలిచింది. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో అకిబ్ నబీ (5/87), సునీల్ (3/41) ధాటికి బెంగాల్ 328 రన్స్ చేసింది.