1992లో ఆంధ్ర-ఒడిశా సరిహద్దు ప్రాంతం నేపథ్యంలో రూపొందుతున్న పీరియడ్ బ్యాక్ డ్రాప్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘కామ్రేడ్ కళ్యాణ్’. శ్రీవిష్ణు టైటిల్‌రోల్ పోషిస్తున్న ఈ చిత్రానికి జానకిరామ్ మారెళ్ల దర్శకుడు. వెంకటకృష్ణ కర్నాటి, సీత కర్నాటి నిర్మాతలు. ఈ సినిమా నిర్మాణం తుదిదశకు చేరుకున్నది. ఈ సందర్భంగా అక్టోబర్ 9న సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ శనివారం ఓ ప్రకటన ద్వారా తెలియజేశారు.
ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్లో ఆలివ్ గ్రీన్ దుస్తుల్లో, మెడలో ఎర్రటి కండువా ధరించి కామ్రేడ్ లుక్‌లో శ్రీవిష్ణు కనిపిస్తున్నారు. భుజంపై రైఫిల్‌తో అడవిలో నడుస్తూ వస్తున్న ఆయనతో పాటు సత్య, ముక్కు అవినాష్ కూడా తోటి కామ్రేడ్లుగా కనిపిస్తున్నారు. మహిమా నంబియార్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో రాధిక శరత్‌కుమార్, షైన్ టామ్ చాకో, ఉపేంద్ర లిమాయే ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి కెమెరా: సాయి శ్రీరామ్, సంగీతం: విజయ్ బుల్గానిన్, సమర్పణ: కోన వెంకట్.