‘తండ్రీకూతుళ్ల తాలూకు బంధం, భావోద్వేగాలు ప్రపంచంలో ఎక్కడైనా ఒకేలా ఉంటాయి. అదే తరహాలో ‘ఇరుముడి’ సినిమా కూడా యూనివర్సల్‌గా ప్రతీ ఒక్కరికి కనెక్ట్ అవుతుంది’ అని చెప్పింది చిత్ర కథానాయిక ప్రియా భవానీ శంకర్. ఆమె రవితేజతో కలిసి నటించిన ఫ్యామిలీ యాక్షన్ డ్రామా ‘ఇరుముడి’ ఈ నెల 21న విడుదలకానుంది. శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది. శనివారం కథానాయిక ప్రియా భవానీ శంకర్ విలేకరులతో సినిమా సంగతుల్ని పంచుకుంది.
ఈ సినిమాలో తాను కావేరి అనే గృహిణి పాత్రలో కనిపిస్తానని, ఆమెకు కూతురే ప్రపంచమని చెప్పింది. ‘కూతుళ్లను అమితంగా ప్రేమించే కావేరిలాంటి పాత్రల్ని ప్రతి ఇంట్లో చూస్తుంటాం. ఈ పాత్ర చేయడం నిజంగా నాకో సవాలు. ముఖ్యంగా పల్లెటూరి యాసలో మాట్లాడటం కష్టంగా అనిపించింది. ఈ కథలో గొప్ప సందేశం కూడా ఉంటుంది. పిల్లలకు ఏం జరిగినా ఆ విషయాలను తల్లిదండ్రులతో షేర్ చేసుకునే స్వేచ్ఛను ఇవ్వాలనే అంశం ప్రతీ ఒక్కరిని ఆలోచింపజేస్తుంది’ అని చెప్పింది.