ఆగమేఘాల మీద మరమ్మతులు
ఏన్కూరు వద్ద కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సీతారామ ప్రాజెక్టు వైరా లింక్ కాలువ సైడ్ బర్మ్స్.. నిర్మాణం పూర్తయిన నెల రోజులకే కుంగిపోవడం సర్వత్రా చర్చనీయాంభమైంది. ఈ విషయంపై గుంభగనంగా ఉంటున్న రేవంత్ సర్కారు.. ఆగమేఘాల మీద మరమ్మతు పనులు చేపట్టింది. వెంటనే యంత్రాలను రంగంలోకి దింపి రిపేర్లు చేసింది.
- తప్పును కప్పిపుచ్చుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వ ప్రయత్నం
- చేపట్టిన నెల రోజులకే నిర్మాణాలు కుంగిపోవడంపై గుంభనం
- ఏన్కూరు వద్ద సీతారామ లింక్ కాలువ సైడ్ బర్ములకు రిపేర్లు
- ‘నమస్తే తెలంగాణ’ ఎఫెక్ట్
వైరా టౌన్, ఆగస్టు 15: ఏన్కూరు వద్ద కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సీతారామ ప్రాజెక్టు వైరా లింక్ కాలువ సైడ్ బర్మ్స్.. నిర్మాణం పూర్తయిన నెల రోజులకే కుంగిపోవడం సర్వత్రా చర్చనీయాంభమైంది. ఈ విషయంపై గుంభగనంగా ఉంటున్న రేవంత్ సర్కారు.. ఆగమేఘాల మీద మరమ్మతు పనులు చేపట్టింది. వెంటనే యంత్రాలను రంగంలోకి దింపి రిపేర్లు చేసింది.
అయితే, కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బరాజ్ వద్ద ఒక్క పిల్లర్ కూలినందుకే.. మొత్తం కాళేశ్వరమే కూలేశ్వరమైందంటూ అబద్ధాలను విస్తృతంగా ప్రచారాలు చేసిన కాంగ్రెస్.. ఇప్పుడు సీతారామ లింక్ కాలువ సైడ్ బర్మ్స్ నిర్మించిన నెల రోజులకే కుంగిపోయి వరదలో కొట్టుకుపోవడంపై ఏమి సమాధానం చెబుతుందన్న ప్రశ్నలు వెల్లువెత్తున్నాయి. ఈ క్రమంలో తన తప్పును కప్పిపుచ్చుకునేందుకు విశ్వప్రయత్నాలు మొదలుపెట్టిన కాంగ్రెస్ సర్కారు.. ఆగమేఘాల మీద మరమ్మతులు చేసింది. ఈ పనులను చూసి ముక్కున వేలేసుకోవడం స్థానిక రైతుల వంతైంది.
నిర్మాణం పూర్తయిన నెల రోజుల్లోనే..
ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు గత కేసీఆర్ ప్రభుత్వం భద్రాద్రి జిల్లా బీజీ కొత్తూరులో సీతారామ ప్రాజెక్టును చేపట్టింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ పదవీకాలం పూర్తయ్యే నాటికి ప్రాజెక్టు పనులను 80 శాతం పూర్తిచేసింది. ఇంతలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ తొలుత ఆ ప్రాజెక్టును నిర్లక్ష్యం చేసింది. ఆ తరువాత ఖమ్మం జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు ప్రాజెక్టు నీళ్లపై కన్నేశారు. వాటిని తమ ప్రాంతాలకు తరలించుకునే కుట్రలకు తెరలేపారు. నీటిని మొదట నిర్దేశించుకున్న విధంగా కాకుండా తమ సొంత ఆలోచనలతో వినియోగించేందుకు పూనుకున్నారు.
ఇందుకోసం ప్రధాన కాలువలకు లింక్ కెనాళ్లు నిర్మించిన సీతారామ కాలువ ద్వారా గోదావరి నీటిని మళ్లించాలని చూశారు. ఈ క్రమంలోనే ఖమ్మం జిల్లా ఏన్కూరు వద్ద సీతారామ ప్రధాన కాలువకు అడ్డుగా రాజీవ్ లింక్ కెనాల్ పేరిట రూ.72 కోట్లతో ఓ కాలువను నిర్మించారు. దీని ద్వారా గోదావరి నీటిని వైరా రిజర్వాయర్కు తరలించాలని, అక్కడి నుంచి నాగార్జున సాగర్ ఆయకట్టుకు అందించాలని చూశారు. అయితే, ఈ కాలువ నిర్మాణంలో భాగంగా ఏన్కూరు వద్ద నెల రోజుల క్రితం లింక్ కెనాల్ సైడ్ బర్మ్స్ నిర్మించారు. తాజాగా శుక్రవారం అవి కుంగిపోయాయి.
కాలువ నీటిలో కలిసి కొట్టుకుపోయాయి. దీంతో స్థానిక రైతులు కూడా కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరంపై నానా యాగీచేసిన కాంగ్రెస్ పాలకులు.. ఇప్పుడు వారు నిర్మించిన కాలువ బర్ములు కొట్టుకుపోవడంపై ఏం సమాధానం చెబుతారంటూ ప్రశ్నించారు. ఈ క్రమంలో ‘నమస్తే’ తెలంగాణ కూడా ‘కట్టి నెలాయే…అప్పుడే కూలిపాయే..’ శీర్షికన శనివారం ఓ కథనాన్ని ప్రచురించింది. దీంతో అప్పటిదాకా గుంభనంగా ఉన్న ప్రభుత్వం.. రైతుల ప్రశ్నలు, ‘నమస్తే’ కథనం నేపథ్యంలో ఆగమేఘాల స్పందించి కూలిన బర్ములకు ఆదరాబాదరాగా మరమ్మతులు చేయించింది.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
Sensory Overload | సెన్సరీ ఓవర్లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
Vijay Deverakonda | ట్యాంక్బండ్పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
Milan protest | ఇటలీలో భారీ నిరసనలు.. స్టోర్ల లూటీ.. తగలబడ్డ రాజధాని మిలన్.. ఖండించిన జార్జియా మెలోని
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

