న్యూఢిల్లీ: అల్టిమేట్ టేబుల్ టెన్నిస్(యూటీటీ) ఐదో సీజ న్ ఆగస్టులో చెన్నై వేదికగా జరుగనుంది. ఆగస్టు 22 నుంచి సెప్టెంబర్ 7వ తేదీ వరకు జరుగనున్న ఈ సీజన్లో రెండు కొత్త జట్లు జైపూర్ పేట్రియాట్స్, అహ్మదాబాద్ ఎస్జీ పైపర్స్ పోటీపడుతాయని నిర్వహకులు గురువారం పేర్కొన్నారు. 2017లో మొదలైన ఈ లీగ్లో ఇప్పటి వరకు నాలుగు సీజన్లు ముగిశాయి. గత సీజన్లో గోవా చాలెంజర్స్ విజేతగా నిలిచింది. ప్రతి జట్టులో ఇద్దరు విదేశీ ప్లేయర్లతో సహా ఆరుగురు ఉంటారు. జట్లు ఎనిమిదికి చేరుకోవడంతో రానున్న సీజన్లో ఫార్మాట్లో మార్పులు చేశారు.