లండన్: భారత్, ఇంగ్లండ్ టెస్టు సిరీస్లో వినియోగిస్తున్న డ్యూక్ బంతులపై ఎన్నడూ లేని విధంగా వివాదం కొనసాగుతున్నది. గతానికి భిన్నంగా డ్యూక్ బాల్స్ స్వల్ప వ్యవధిలోనే బంతి ఆకారంతో పాటు మెరుపు కోల్పోతున్నాయి. దీనిపై టీమ్ఇండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయగా, మాజీ క్రికెటర్లు తమదైన శైలిలో విమర్శలు ఎక్కుపెట్టారు. దీంతో వెంటనే రంగంలోకి దిగిన బ్రిటిష్ క్రికెట్ బాల్స్ లిమిటెడ్ కంపెనీ బంతుల తయారీపై సమీక్షకు సిద్ధమైంది.
లెదర్ నుంచి మొదలుపెడితే ట్యానింగ్ పద్ధతి, బంతి తయారీకి వాడే ముడి పదార్థాలపై అన్నింటిపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తామని కంపెనీ యజమాని దిలిప్ జజోడియా పేర్కొన్నాడు. ఏదైనా మార్పులు అవసరమైతే కచ్చితంగా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపాడు.