న్యూఢిల్లీ: మహిళల ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) వేలానికి రంగం సిద్ధమైంది. ఈనెల 27న ఢిల్లీ డబ్ల్యూపీఎల్ వేలం పాట జరుగనుంది. రానున్న లీగ్ కోసం ఫ్రాంచైజీలు ఇప్పటికే కొందరిని అట్టిపెట్టుకోగా, మరికొందరిని వదులుకున్నాయి. ఈ నేపథ్యంలో ఖాళీగా ఉన్న 73 స్థానాల కోసం వివిధ దేశాలకు చెందిన 277 మంది ప్లేయర్లు వేలంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
ఇందులో ముఖ్యంగా టీమ్ఇండియా వన్డే ప్రపంచకప్ విజయంలో కీలకంగా వ్యవహరించిన ఆల్రౌండర్ దీప్తిశర్మతో పాటు రేణుకాసింగ్ ఠాకూర్, హర్లిన్ డియోల్, ప్రతీకా రావల్, క్రాంతి గౌడ్ లాంటి క్రికెటర్లు 50 లక్షల విభాగంలో ఉన్నారు. వీరికి తోడు సోఫీ డివైన్, అలీస్సా హిలీ, లానింగ్ కూడా ఇదే గ్రూపులో కొలువుదీరారు.