హైదరాబాద్, ఆట ప్రతినిధి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న సీఎం కప్-2023 టోర్నమెంట్ జిల్లా స్థాయికి చేరింది. సాట్స్ ఆధ్వర్యంలో సోమవారం నుంచి 33 జిల్లాల్లో పోటీలు ప్రారంభం కానున్నాయి. రెండో అంచె పోటీల కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. మండల స్థాయిలో తొలి మూడు స్థానాల్లో నిలిచిన జట్ల మధ్య మూడు రోజుల పాటు పోటీలు జరుగనున్నాయి.
అథ్లెటిక్స్, ఖోఖో, కబడ్డీ, వాలీబాల్, ఫుట్‌బాల్, బ్యాడ్మింటన్, బాస్కెట్‌బాల్, బాక్సింగ్, స్విమ్మిం గ్, హ్యాండ్‌బాల్, రెజ్లింగ్, వంటి 11 క్రీడాంశాల్లో పోటీలు నిర్వహించనున్నట్లు క్రీడా మంత్రి శ్రీనివాస్‌గౌడ్, సాట్స్ చైర్మన్ ఆంజనేయగౌడ్ తెలిపారు. జిల్లా టోర్నీలకు కలెక్టర్లు చైర్మన్లుగా వ్యవహరించనున్నారు. దశాబ్ది ఉత్సవాల నేపథ్యంలో గ్రామీణ ప్రతిభను వెలికితీసేందుకు ఈ పోటీలు నిర్వహిస్తున్నారు.