ఢాకా: భారత్కు వెళ్లకూడదన్న తమ ప్రభుత్వ నిర్ణయంపై బంగ్లాదేశ్ ఆటగాళ్లు ఆగ్రహంగా ఉన్నారా? అసలు దీనిపై ఆ దేశ ప్రభుత్వం గానీ, క్రికెట్ బోర్డు గానీ ఆటగాళ్లతో చర్చలు జరుపలేదా? అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది. ఇదే విషయమై పేరు చెప్పడానికి ఇష్టపడని పలువురు బంగ్లా క్రికెటర్లు స్పందిస్తూ.. ‘వాళ్లు (ప్రభుత్వం) మమ్మల్ని ఏమీ అడుగలేదు.
వాళ్లే ఒక నిర్ణయానికి వచ్చి భారత్కు వెళ్లడం లేదని తేల్చి చెప్పారు. అది పూర్తిగా ప్రభుత్వ నిర్ణయం’ అని అన్నారు. ‘బంగ్లాదేశ్లో క్రికెట్ కథ ముగిసినట్టే! మేం అక్కడికి వెళ్లకపోతే అది మాకే నష్టం. దీని గురించి ఎవరు పట్టించుకుంటారు?’ అని ఆవేదన వ్యక్తం చేశారు.