ఢిల్లీ: ఈనెల 13 నుంచి 21 వరకు టోక్యో (జపాన్) వేదికగా జరుగబోయే వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్స్ కోసం భారత్ 19 మందితో కూడిన బృందాన్ని ఆదివారం భారత అథ్లెటిక్స్ సమాఖ్య (ఏఎఫ్ఐ)ప్రకటించింది. వరల్డ్ జావెలిన్ చాంపియన్ నీరజ్ చోప్రా ఆధ్వర్యంలోని బృందంలో.. మరో ముగ్గురు బల్లెం వీరులు (సచిన్ యాదవ్, యశ్ వీర్ సింగ్, రోహిత్ యాదవ్) చోటు సంపాదించారు.
మురళీ శ్రీశంకర్ (లాంగ్ జంప్), గుల్వీర్ సింగ్ (5 వేల, 10 వేల మీటర్ల పరుగు పందెం), ప్రవీణ్ చతుర్వేది (ట్రిపుల్ జంప్), పారుల్ చౌదరి (3 వేల మీ. పరుగు), అన్నూ రాణి (మహిళల జావెలిన్ త్రో) భారత్కు పతకాలు తెచ్చే అథ్లెట్ల రేసులో ముందున్నారు.