మహబూబ్‌నగర్ అర్బన్, డిసెంబర్ 6: జిల్లా కేంద్రంలోని 51వ రాష్ట్ర స్థాయి జూనియర్స్ బాలుర కబడ్డీ టోర్నీ హోరాహోరీగా సాగుతున్నది.
పోటీలకు రెండో రోజైన శనివారం మహబూబాబాద్ జట్టు 39-28తో ఖమ్మంపై, సూర్యాపేట 53-28తో సిద్దిపేటపై, గద్వాల 62-33 తేడాతో భూపాలపల్లిపై, హైదరాబాద్ 62-32తో వికారాబాద్‌పై, ములుగు 44-31తో నిజామాబాద్‌పై, ఆదిలాబాద్ 29-27తో కొత్తగూడెంపై, సిరిసిల్ల 39-37తో నిర్మల్‌పై, రంగారెడ్డి 57-26తో మంచిర్యాలపై, హైదరాబాద్ 56-37తో పెద్దపల్లిపై, ఆసిఫాబాద్ 48-32 తేడాతో వరంగల్‌పై, సిద్దిపేట 32-16 తేడాతో జగిత్యాలపై, మెదక్ 59-45 తేడాతో భూపాలపల్లిపై విజయాలు సాధించాయి.