హైదరాబాద్, లక్నో మ్యాచ్‌కు ముందు ఉప్పల్ స్టేడియంలో టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ తమన్ ఆధ్వర్యంలో అదిరిపోయే మ్యూజిక్ షో జరిగింది. రైజర్స్ అభిమానులను అలరిస్తూ తమన్ సూపర్ హిట్ పాటలతో దుమ్మురేపాడు. ఫ్యాన్స్‌లో కొత్త జోష్ నింపుతూ తమన్ పాటిన పాటలకు స్టేడియం మొత్తం హోరెత్తిపోయింది.
హిట్ సాంగ్స్‌కు స్టాండ్స్‌లో ఉన్న ఫ్యాన్స్ డ్యాన్స్ చేస్తూ హంగామా చేశారు. ప్రత్యేకమైన వాహనంలో స్టేడియం మొత్తం కలియ తిరుగుతూ తమన్ అభిమానులను అలరించాడు. మొత్తంగా దాదాపు అర్ధగంట పాటు సాగిన మ్యూజికల్ షో ఉప్పల్ స్టేడియానికి కొత్త అందాన్ని తీసుకొచ్చింది. షో జరుగుతున్నంత సేపు స్టేడియంలో కండ్లు మిరుమిట్లు గొలిపే రీతిలో లైట్లు ఏర్పాటు చేశారు.