దుబాయ్: సంప్రదాయ టెస్ట్ క్రికెట్లో భారీ మార్పులకు ఐసీసీ శ్రీకారం చుట్టనుంది. వచ్చే వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) సైకిల్ (2027-29) నుంచి టెస్టులను నాలుగు రోజులే ఆడించేందుకు రంగం సిద్ధం చేసింది. ఇందుకు సంబంధించి గత వారం లండన్‌లో ముగిసిన డబ్ల్యూటీసీ ఫైనల్ సమయంలో ఇది చర్చకు వచ్చినట్టు సమాచారం. అయితే ఈ విధానం అగ్రశ్రేణి జైట్లెన ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, భారత్‌కు వర్తించదు. ఆ జట్లు యాషెస్‌తో పాటు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టెస్టులను ఐదు రోజులే ఆడనున్నాయి.
జింబాబ్వే, ఐర్లాండ్ వంటి చిన్న జట్లు మాత్రం ఐదు రోజుల టెస్టులతో పెరుగుతున్న ఖర్చు కారణంగా 4 రోజుల టెస్టుల వైపు మొగ్గు చూపుతున్నాయి. వాస్తవానికి ఐసీసీ ఈ విధానాన్ని 2017లోనే తీసుకొచ్చింది. 2019, 2023లో ఇంగ్లం డ్.. ఐర్లాండ్‌తో 4 రోజుల టెస్టులు ఆడింది. గత నెల ఇంగ్లీష్ జట్టు.. జింబాబ్వేతోనూ 4 రోజుల టెస్టు ఆడింది. కాగా నాలుగు రోజుల టెస్టులలో ఒక రోజు ఓవర్లను 90 నుంచి 98 ఓవర్లకు పెంచనున్నారు.