PKL | పుణె: ప్రొ కబడ్డీ లీగ్(పీకేఎల్) 11వ సీజన్ లీగ్ దశను తెలుగు టైటాన్స్ విజయంతో ముగించింది. శుక్రవారం జరిగిన తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో టైటాన్స్ 48-36 తేడాతో పుణెరి పల్టాన్‌పై అద్భుత విజయం సాధించింది. టైటాన్స్ జట్టులో కెప్టెన్ పవన్ సెహ్రావత్(15 పాయింట్లు) మరోసారి సూపర్-10తో కదంతొక్కాడు. పవన్‌కు తోడు ఆశీష్ నార్వల్ (11), డిఫెండర్ అంకిత్(6) కూడా సత్తాచాటారు.
పుణె జట్టులో అజిత్(10), ఆర్యవర్ధన్ (8) ఆకట్టుకున్నారు. మొత్తం 22 మ్యాచ్‌ల్లో 12 విజయాలు సాధించిన టైటాన్స్ 66 పాయింట్లతో యూ ముంబాతో సమంగా నిలిచింది. లీగ్‌లో ఇప్పటికే ఐదు బెర్తులు ఖరారు కాగా, మరో బెర్తు ఎవరిదో త్వరలో తేలనుంది. మరోవైపు 21 మ్యాచ్‌ల్లో 10వ ఓటమితో పుణె(55) ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది.