వైజాగ్: ప్రో కబడ్డీ లీగ్ (పీకేఎల్) 12వ ఎడిషన్‌లో ఆతిథ్య తెలుగు టైటాన్స్ జట్టుకు వరుసగా రెండో మ్యాచ్‌లోనూ పరాజయం ఎదురైంది. తమిళ తలైవాస్‌తో తొలి మ్యాచ్ ఓడిన టైటాన్స్.. శనివారం నాటి మ్యాచ్‌లో 35-40తో యూపీ యోధాస్ చేతిలో ఓడింది.
ఆట ఆరంభంలో టైటాన్స్ ఆధిపత్యం చెలాయించినా తర్వాత యూపీ పుంజుకుని రెండో అర్ధభాగంలో రెచ్చిపోయింది.