జైపూర్: ప్రొ కబడ్డీ లీగ్(పీకేఎల్)లో తెలుగు టైటాన్స్ మళ్లీ గెలుపు బాట పట్టింది. లీగ్‌లో వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ఓడిన టైటాన్స్ జూలు విదిల్చింది. శుక్రవారం సవాయ్ మాన్సింగ్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో టైటాన్స్ 43-29 తేడాతో తమిళ్ తలైవాస్‌పై ఘన విజయం సాధించింది. టైటాన్స్ తరఫున విజయ్(10), భరత్(8), అంకిత్(4) రాణించారు. మరోవైపు వరుస విజయాలతో జోరుమీద కనిపించిన తలైవాస్‌కు అర్జున్ దేశ్వాల్(7), నరేందర్(6), రోనక్(4) ఆకట్టుకున్నారు.
లీగ్‌లో నిలువాలంటే ఇప్పటి నుంచి ప్రతీ మ్యాచ్ కీలకమైన నేపథ్యంలో తెలుగు టైటాన్స్ సమిష్టి ప్రదర్శన కనబరిచింది. స్టార్ రైడర్లు విజయ్ మాలిక్, భరత్ రైడింగ్‌కు వెళ్లిన ప్రతీసారి కచ్చితంగా పాయింట్లు తీసుకొచ్చారు. ఈ విజయంతో టైటాన్స్నాలుగో స్థానంలో కొనసాగుతున్నది.