హనుమకొండ చౌరస్తా, నవంబర్ 27: బహ్రెయిన్ వేదికగా ఈనెల 24 నుంచి 27 వరకు జరిగిన తొలి ప్రపంచ పారా తైక్వాండో చాంపియన్షిప్లో తెలంగాణకు చెందిన ఎల్లావుల గౌతమ్యాదవ్ పసిడి పతకంతో మెరిశాడు. ప్రపంచవ్యాప్తంగా 48 దేశాల నుంచి 260 మంది పోటీపడగా, భారత్ నుంచి గౌతమ్యాదవ్ బరిలోకి దిగాడు. పురుషుల సీనియర్ పీ-51 విభాగంలో పోటీపడ్డ గౌతమ్..ప్రత్యర్థులపై అద్భుత విజయాలతో పసిడి పతకాన్ని ఒడిసిపట్టుకున్నాడు.