ఆట అంటే ఆయనకు ఇష్టం. బతుకంతా ఆటే అంటాడు. ఆ బతుకులో సూపర్ కిక్ ఉండాలనే తైక్వాండో క్రీడను ఎంచుకున్నాడు. వరల్డ్ చాంపియన్ లక్ష్యంగా ముందుకుసాగాడు ఎల్లావుల గౌతమ్ యాదవ్. అనుకోని అడ్డంకులు వచ్చిపడ్డాయి.
బహ్రెయిన్ వేదికగా ఈనెల 24 నుంచి 27 వరకు జరిగిన తొలి ప్రపంచ పారా తైక్వాండో చాంపియన్షిప్లో తెలంగాణకు చెందిన ఎల్లావుల గౌతమ్యాదవ్ పసిడి పతకంతో మెరిశాడు.