హైదరాబాద్, ఆట ప్రతినిధి : నవంబర్ 15 నుంచి 26దాకా జపాన్లోని టోక్యో వేదికగా జరుగబోయే సమ్మర్ డెఫ్ ఒలింపిక్స్లో దేశం తరఫున ప్రాతినిథ్యం వహించేందుకు తెలంగాణ రాష్ర్టానికి చెందిన టెన్నిస్ క్రీడాకారిణి భవాని కెడియా ఎంపికైంది. వినికిడిలోపం ఉన్న క్రీడాకారుల కోసం నిర్వహించబోయే ఈ ఈవెంట్లో భవాని ఆడనుంది.
2022లో బ్రెజిల్లో జరిగిన డెఫ్ ఒలింపిక్స్లో పాల్గొన్న ఆమె.. ప్రస్తుతం ఎం/ఎస్ వాల్యూ ల్యాబ్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ ప్రాజెక్ట్ వద్ద డేవిస్ కప్ మాజీ క్రిడాకారుడు ఎం. వాసుదేవరెడ్డి మార్గదర్శకత్వంలో శిక్షణ పొందుతున్నది.