హైదరాబాద్, ఆట ప్రతినిధి: అమెరికా వేదికగా జరుగుతున్న ఐటీఎఫ్ మహిళల టెన్నిస్ టోర్నీలో తెలంగాణ యువ ప్లేయర్ సహజ యమ్లపల్లి సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. శనివారం మహిళల సింగిల్స్ క్వార్టర్స్‌లో సహజ 6-1, 6-1తో ఒలీవియా లిన్సర్(పోలండ్)పై అలవోక విజయం సాధించింది.
ఆది నుంచే తనదైన దూకుడు కనబరిచిన సహజ..వరుస సెట్లలో ప్రత్యర్థిని మట్టికరిపించింది.