కొచ్చి: 28వ జాతీయ ఫెడరేషన్ సీనియర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ యువ అథ్లెట్ నిత్య గాదె పసిడి పతకంతో మెరిసింది. సోమవారం జరిగిన మహిళల 100మీటర్ల రేసును నిత్య 11.50 సెకన్ల టైమింగ్‌తో పూర్తి చేసి అగ్రస్థానంలో నిలిచింది.
ట్రాక్‌పై చిరుతను తలపించిన నిత్య..ప్రత్యర్థులకు దీటైన పోటీనిస్తూ స్వర్ణం ఖాతాలో వేసుకుంది. ఇటీవల కాలంలో నిలకడగా రాణిస్తూ వస్తున్న ఈ యువ అథ్లెట్ జాతీయ స్థాయిలో పతకాలు కొల్లగొడుతున్నది.