Grandmaster | తెలంగాణకు అరుదైన గౌరవం.. భారత్‌కు మరో గ్రాండ్‌మాస్టర్
తెలంగాణ రాష్ట్రానికి అరుదైన గౌరవం దక్కింది. రాష్ట్రానికి చెందిన 19 ఏళ్ల రాహుల్ శ్రీవాస్తవ్ 74వ చెస్ గ్రాండ్ మాస్టర్‌గా అవతరించాడు. ఇటలీలో జరుగుతున్న కట్టోలికా చెస్ ఫెస్టివల్ 2022లో 8వ గేమ్‌ను డ్రా చేసుకున్న రాహుల్.. గ్రాండ్ మాస్టర్ అవడానికి అవసరమైన 2500 పాయింట్లను అధిగమించాడు.
గ్రాండ్ మాస్టర్ లెవాన్ పాన్సులాయాతో జరిగిన మ్యాచ్‌ను రాహుల్ డ్రా చేసుకున్నాడు. ప్రస్తుతం రాహుల్ ఎలో రేటింగ్ 2468గా ఉంది. శుక్రవారం నాడు 2500 లైవ్ ఎలో పాయింట్లను అధిగమించి గ్రాండ్ మాస్టర్ టైటిల్ సాధించాడీ తెలంగాణ కుర్రాడు. ఎవరైనా గ్రాండ్ మాస్టర్ అవ్వాలంటే దీనికి సంబంధించిన మూడు నార్మ్‌లు సాధించాలి, అలాగే లైవ్ రేటింగ్స్‌లో 2500 పాయింట్లు దాటాలి.
ఈ సందర్భంగా ఆలిండియా చెస్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ సంజయ్ కపూర్ ట్వీట్ చేస్తూ.. ‘‘భారతదేశం 100 మంది గ్రాండ్‌మాస్టర్ల మైలురాయి చేరుకోవడానికి మరో అడుగు చేరువైంది. ఈ ఎలైట్ క్లబ్ చేరిన 19 ఏళ్ల రాహుల్ శ్రీవాస్తవ్‌ను చూడండి. తెలంగాణకు చెందిన ఈ కుర్రాడు భారతదేశపు 74వ గ్రాండ్ మాస్టర్. అతనికి, కోచ్‌లకు, రాహుల్ కుటుంబానికి అందరికీ శుభాకాంక్షలు’’ అని పేర్కొన్నారు.
India one more step closer to getting 100 Grandmasters!
Meet our newest addition to the elite club, 19-year-old Rahul Srivatshav from Telangana, India's 74th Grandmaster!
A big congratulations to Rahul, his coach and family! pic.twitter.com/MrldFe99aw
— Dr. Sanjay Kapoor (@SnjKpr) June 11, 2022
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

