జనగామ చౌరస్తా: దక్షిణాది రాష్ర్టాల 20వ సీనియర్ సాఫ్ట్‌బాల్ టోర్నీలో ఆతిథ్య తెలంగాణ విజేతగా నిలిచింది. ఆదివారం జరిగిన మహిళల ఫైనల్లో తెలంగాణ 6-5తో కేరళపై అద్భుత విజయం సాధించింది. ఆంధ్రప్రదేశ్‌కు మూడో స్థానం దక్కింది. పురుషుల విభాగంలో ఆంధ్రప్రదేశ్ 10-0తో తెలంగాణపై గెలిచి ట్రోఫీ కైవసం చేసుకోగా, కేరళ మూడో స్థానానికి పరిమితమైంది.
ఫైనల్ మ్యాచ్‌కు ముఖ్య అతిథిగా సాఫ్ట్‌బాల్ అసోసియేషణ్ రాష్ట్ర చైర్మన్ సాంబశివరావు, లవకుమార్‌రెడ్డి, సీఐ శ్రీనివాస్ హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. జిల్లా కేంద్రంలోని ప్రెస్టన్ పాఠశాల మైదానంలో మూడు రోజులుగా జరిగిన టోర్నీలో ఏడు దక్షిణాది రాష్ర్టాల నుంచి 224 మంది ప్లేయర్లతో పాటు 28 మంది కోచ్‌లు పాల్గొన్నారు.