Basketball | హైదరాబాద్, ఆట ప్రతినిధి: సరూర్‌నగర్ స్టేడియం వేదికగా జరుగుతున్న 49వ జాతీయ సబ్‌జూనియర్ బాస్కెట్‌బాల్ టోర్నీలో తెలంగాణ సత్తాచాటింది.
గురువారం జరిగిన పోరులో రాష్ట్ర బాలికల టీమ్ 53-52తో చండీగఢ్‌పై ఉత్కంఠ విజయం సాధించింది. ఆఖరి వరకు హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో తెలంగాణ తరఫున మైత్రి (20), చైత్ర (17), ఆరాధ్య (8) ఆకట్టుకున్నారు. చండీగఢ్ జట్టులో స్మయ(24), జియా(18) రాణించారు.