హైదరాబాద్, ఆట ప్రతినిధి: ప్రతిష్ఠాత్మక సంతోశ్ ట్రోఫీ ఫుట్‌బాల్ టోర్నీలో ఆతిథ్య తెలంగాణకు డ్రా ఎదురైంది. శనివారం స్థానిక శ్రీనిధి దక్కన్ ఎరీనాలో తెలంగాణ, రాజస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్ 1-1తో డ్రాగా ముగిసింది. నిర్ణీత సమయంలో ఇరు జట్లు చెరో గోల్ చేశాయి.
అంతకుముందు జరిగిన మరో మ్యాచ్‌లో మణిపూర్ 1-0తో సర్వీసెస్‌పై గెలిచి బోణీ కొట్టింది. తెలంగాణ, రాజస్థాన్ మ్యాచ్‌ను సాట్స్ చైర్మన్ శివాసేనారెడ్డి అధికారికంగా ప్రారంభించారు. 57 ఏండ్ల తర్వాత సంతోశ్ ట్రోఫీకి తెలంగాణ ఆతిథ్యమిస్తున్నది.