హైదరాబాద్, ఆట ప్రతినిధి: జాతీయ సీనియర్ పురుషుల 51వ హ్యాండ్బాల్ చాంపియన్షిప్లో పాల్గొనే తెలంగాణ జట్టును శుక్రవారం ఎంపిక చేశారు.
ఎల్బీ స్టేడియంలో వారం రోజులుగా జరుగుతున్న శిక్షణ శిబిరంలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన 16 మందిని ఎంపిక చేశారు. ఈ నెల 7 నుంచి లక్నో వేదికగా జాతీయ టోర్నీ జరుగనుండగా.. ఆటగాళ్లకు జాతీయ హ్యాండ్బాల్ సంఘం అధ్యక్షుడుఅర్శనపల్లి జగన్ మోహన్రావు శుభాకాంక్షలు తెలిపారు.