హైదరాబాద్, ఆట ప్రతినిధి : అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న జూనియ ర్ నేషనల్ స్విమ్మింగ్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ స్విమ్మర్లకు రెండు పతకాలు దక్కాయి. పురుషుల 200 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌లో రాష్ర్టానికి చెందిన సుహాస్ ప్రీతమ్ (2:05 నిమిషాల 57 సెకన్లు) రజతం గెలిచాడు.
బెంగాల్ స్విమ్మర్ కనిష్ చక్రవర్తి (2:04 నిమిషాల 98 సెకన్లు)కి పసిడి దక్కగా.. ఆంధ్రప్రదేశ్ ఆటగాడు తీర్థు (2:06 నిమిషాల 84 సెకన్లు)కాంస్యం గెలుచుకున్నాడు. మహిళల 400 మీటర్ల మెడ్లీ విభాగంలో శ్రీనిత్య (5:13 నిమిషాల 67 సెకన్లు) కాంస్యం గెలుచుకోగా కర్నాటకకు చెందిన శదాక్షరి, హర్షిక వరుసగా స్వర్ణ, రజత పతకాలు నెగ్గారు.