హనుమకొండ చౌరస్తా, జూలై 27: తెలంగాణ సబ్ జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ పోటీలు ఆదివారం వరంగల్‌లో ముగిశాయి. బాలుర సింగిల్స్ ఫైనల్లో శశాంక్(నల్లగొండ)15-11, 17-15తో యువసూర్య(హైదరాబాద్)పై గెలిచి టైటిల్ దక్కించుకున్నాడు. బాలికల సింగిల్స్ తుదిపోరులో సరయు(హైదరాబాద్) 9-15, 15-12, 15-12తో ప్రాంజల(రంగారెడ్డి)పై విజయంతో ట్రోఫీ కైవసం చేసుకుంది.
ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి, జాయింట్ కలెక్టర్ సాయి హర్షిత్, వెస్ట్‌జోన్ డీసీపీ అంకిత్‌కుమార్, మాదాపూర్ డీసీపీ శోభన్‌కుమార్, అంతర్జాతీయ క్రీడాకారుడు సీఎం శశిధర్ పాల్గొని విజేతలకు ట్రోఫీలు అందజేశారు.