హైదరాబాద్, ఆట ప్రతినిధి: జాతీయ జూనియర్ సెయిలింగ్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ సెయిలర్స్ నాలుగు స్వర్ణ పతకాలు సహా మొత్తం ఆరు పతకాలతో సత్తా చాటారు. ముంబైలోని మార్వేలో జరిగిన ఈ టోర్నీలో హైదరాబాద్ రసూల్‌పురాలోని ఉద్భవ్ స్కూల్‌కు చెందిన లాహిరి .. అండర్ -16 సబ్ జూనియర్ విభాగంలో పసిడి గెలిచింది.
అదే పాఠశాలకు చెందిన తనూజ, శ్రవణ్ జూనియర్ డబుల్ హ్యాండర్ విభాగాల్లో విజయాలు సాధించారు. అండర్ -15 విభాగంలో బొంగూర్ బన్నీకి పసిడి, రిజ్వాన్ మహ్మద్ రజతం, రవికుమార్ కాంస్యం గెలిచారు.