Telangana | హైదరాబాద్, ఆట ప్రతినిధి: షిల్లాంగ్ (మేఘాలయ) వేదికగా జరిగిన జాతీయ ర్యాంకింగ్ సెయిలింగ్ టోర్నీలో తెలంగాణ సెయిలర్లు పతక జోరు కనబరిచారు. ఉమియం సరస్సులో జరిగిన టోర్నీలో మన సెయిలర్లు తొమ్మిది పతకాలు కైవసం చేసుకున్నారు. దీనికి తోడు ఉత్తమ సెయిలింగ్ జట్టు అవార్డును దక్కించుకుంది. బాలుర అండర్-15 విభాగంలో గోవర్ధన్ తొలిసారి జాతీయ టైటిల్‌ను ఖాతాలో వేసుకున్నాడు. హైదరాబాద్‌కే చెందిన దీక్షితను ఓడిస్తూ స్వర్ణ పతకం కూడా గెలుచుకున్నాడు.
సిస్టర్స్ ద్వయం కొమురవెల్లి దీక్షిత, లహరి స్వర్ణం, రజతాలు కైవసం చేసుకున్నారు. ఒక జాతీయ టోర్నీలో తెలంగాణకు మూడు పతకాలు రావడం ఇదే తొలిసారి. భారత రెండో ర్యాంకర్ బన్నీ..రిజ్వాన్‌ను ఓడించి కాంస్యం కైవసం చేసుకున్నాడు. అండర్-18లో డబుల్ హ్యాండర్లో తనుజా కామేశ్వర్-గణేశ్ రజతం దక్కించుకోగా, ధరణి, మల్లేశ్ వెండి ఖాతాలో వేసుకున్నారు. మొత్తంగా జాతీయ సెయిలింగ్‌లో తెలంగాణ అత్యుత్తమ ప్రదర్శనగా ఇది నిలిచింది.