హైదరాబాద్, ఆట ప్రతినిధి: కటక్(ఒడిశా) వేదికగా జరిగిన ఆల్ఇండియా ఇండోర్ రోయింగ్ చాంపియన్షిప్లో తెలంగాణ రోయర్లు పతక జోరు కనబరిచారు. నాలుగు రోజుల పాటు జరిగిన టోర్నీలో రెండు స్వర్ణాలు సహా మూడు రజతాలు, రెండు కాంస్య పతకాలతోమెరిశారు.
అండర్-15 బాలికల పెయిర్లో వర్షిత, ధాత్రి, లావణ్య, దేవేంద్రమ్మతో కూడిన తెలంగాణ పసిడి సొంతం చేసుకుంది. అండర్-15 బాలుర పెయిర్లో యశ్వంత్, సాయితేజ రజతం దక్కించుకున్నారు. బాలుర రిలేలో యశ్వంత్, సాయితేజ వెండి పతకం దక్కించుకున్నారు.