హైదరాబాద్, ఏప్రిల్ 22 (నమస్తే తెలంగాణ): కొచ్చి(కేరళ) వేదికగా జరిగిన ఆల్ఇండియా పోలీస్ స్పోర్ట్స్ టోర్నీలో తెలంగాణ పోలీసులు సత్తాచాటారు. ఈనెల 11 నుంచి 15వ వరకు జరిగిన బ్యాడ్మింటన్, టీటీ పోటీల్లో మన పోలీస్ ప్లేయర్లు రెండు స్వర్ణాలు సహా రెండు రజతాలు, 14 కాంస్య పతకాలు కైవసం చేసుకున్నారు.
ఈ సందర్భంగా రాష్ట్ర డీజీపీ డాక్టర్ జితేందర్ విజేతలను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఐజీ రమేశ్, డీఎస్పీ రామారావు పాల్గొన్నారు.