హైదరాబాద్, అక్టోబర్ 6 (నమస్తే తెలంగాణ): తెలంగాణ పోలీసు రెజ్లింగ్ క్లస్టర్ జట్లు జాతీయ స్థాయిలో సత్తా చాటాయి. హర్యానాలోని కర్నాల్, మధుబన్‌లో సెప్టెంబర్ 20 నుంచి 24వ తేదీ వరకు జరిగిన 74వ అఖిల భారత పోలీస్ కుస్తీ క్లస్టర్లో తెలంగాణ పోలీసు ప్లేయర్లు రెండు కాంస్య పతకాలను గెలుచుకున్నారు.
ప్రతిభ కనబర్చిన విజేతలను, కోచ్‌లను డీజీపీ బి శివధర్‌రెడ్డి అభినందించి, సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఐజీ రమేశ్, క్రీడాకారులు ఎన్ జశ్వంత్, రాధిక ఉన్నారు.