హైదరాబాద్, ఆట ప్రతినిధి: పంజాబ్లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ(ఎల్పీయూ) వేదికగా ఏషియన్ పారా తైక్వాండో టోర్నీలో తెలంగాణ పారా టీమ్ అదరగొట్టింది. వివిధ విభాగాల్లో రాష్ట్ర పారా అథ్లెట్లు గౌతమ్యాదవ్(పీ51), శివ(పీ 52) పసిడి పతకాలతో మెరువగా, కృష్ణవేణి(పీ 52) రజతం దక్కించుకోగా, సక్కుబాయి(పీ 72), అబ్దుల్(పీ 52) కాంస్యాలు ఖాతాలో వేసుకున్నారు.
మొత్తంగా టోర్నీలో రెండు స్వర్ణాలు సహా రజతం, రెండు కాంస్యాలు కైవసం చేసుకున్నారు. ఇదిలా ఉంటే వచ్చే నెల 28 నుంచి మొదలయ్యే ఏషియన్ పారా తైక్వాండో టోర్నీలో గౌతమ్యాదవ్, శివ..భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించనున్నారు.