Alika Joy | హైదరాబాద్, ఆట ప్రతినిధి: ఫేడరేషన్ కప్ వుషు చాంపియన్షిప్లో తెలంగాణ అమ్మాయి అలికా జోయ్ రజత పతకంతో మెరిసింది. జార్ఖండ్ రాజధాని రాంచీలో జరిగిన పోటీల్లో రాష్ర్టానికి ప్రాతినిధ్యం వహించిన అలికా 7.50 స్కోరుతో రెండో స్థానం దక్కించుకుంది. గీత (మణిపూర్; 8.00), హర్షిత (చండీగఢ్ 7.10) వరుసగా స్వర్ణ, కాంస్యాలు గెలుచుకున్నారు.