Asia Cup-2023 |ఆసియా కప్ సూపర్-4లో భాగంగా మంగళవారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో భారత్ విజయం సాధించింది. శ్రీలంకపై 41 పరుగుల తేడాతో గెలుపొందింది. 214 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన శ్రీలంక 172 పరుగులకే ఆలౌట్ అయింది.
ధనంజయ డిసిల్వా 41, దునిల్ వెల్లలాగే 42 పరుగులు చేశారు. టీం ఇండియా బౌలర్లలో కుల్దీప్ యాదవ్ నాలుగు, బుమ్రా, రవీంద్ర జడేజా చెరో రెండు వికెట్లు, సిరాజ్, హార్దిక్ పాండ్యా ఒక్కో వికెట్ తీశారు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన టీం ఇండియా 213 పరుగులకు ఆలౌట్ అయింది.