వడోదర: టీమ్ఇండి యా వికెట్‌కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్‌ను గాయాలు వేధిస్తున్నాయి. నిరుడు ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ సందర్భంగా గాయపడి సుమారు 4 నెలల పాటు ఆటకు దూరమై దక్షిణాఫ్రికా సిరీస్‌తో రీఎంట్రీ ఇచ్చిన అతడు.. న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు ఎంపికైనా మళ్లీ గాయం కారణంగా సిరీస్‌కు దూరమయ్యాడు.
శనివారం వడోదరలో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్న పంత్.. పొట్ట కింది భాగంలో నొప్పితో విలవిల్లాడటంతో అతడిని హుటాహుటిన దవాఖానకు తీసుకెళ్లారు.అతడి స్థానాన్ని ధృవ్ జురెల్ భర్తీ చేశాడు.