Team India | ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో వన్డేలో టీం ఇండియా ఓటమి అంచుల్లో ఉంది. కేవలం 29 ఓవర్లలో 112 పరుగులు చేసిన టీం ఇండియా బ్యాట్స్మన్లు లక్ష్యసాధనలో కుదేలయ్యారు. సారధి రోహిత్ శర్మ డకౌట్‌తో టీం ఇండియా కుర్రాళ్లు ఒత్తిడికి గురయ్యారు. మరో ఓపెనర్ శిఖార్ ధావన్ 9 పరుగులకే ఔటయ్యాడు. మాజీ సారధి విరాట్ కోహ్లీ మెరుపులు మెరిపించి 16 పరుగులు చేసి పెవిలియన్ బాట పట్టాడు. తర్వాత హార్థిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్ 29, 27 పరుగులతో పర్వాలేదనిపించినా.. తర్వాత వచ్చిన బ్యాట్స్మన్లు క్రీజ్ ముందు నిలబడలేకపోయారు.
ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్‌లో టీం ఇండియాకు ప్రారంభంలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. శిఖార్ ధావన్‌తో కలిసి ఓపెనింగ్‌కు వచ్చిన టీం ఇండియా సారధి రోహిత్ శర్మ ఔటయ్యాడు. ఒక్క పరుగు కూడా చేయకుండానే డకౌట్ అయ్యాడు. మూడో ఓవర్లో టోప్లే వేసిన నాలుగో బంతికి రోహిత్ శర్మ ఒక్క పరుగు కూడా చేయకుండానే పెవిలియన్ దారి పట్టాడు. వన్ డౌన్ బ్యాటింగ్‌కు వచ్చిన విరాట్ కోహ్లీ, శిఖార్ ధావన్ క్రీజ్‌లో కొనసాగుతున్నారు. ఐదు ఓవర్లు ముగిసే సరికి టీం ఇండియా 10 పరుగులు చేసింది.