Asia Cup : ఆసియా కప్‌లో భారత జట్టు నామమాత్రపు మ్యాచ్‌కు సిద్ధమైంది. వరుసగా రెండు విజయాలతో సూపర్ 4కు దూసుకెళ్లిన టీమిండియా శుక్రవారం ఒమన్(Oman)తో తలపడనుంది. డిఫెండింగ్ ఛాంపియన్ అయిన భారత్.. కీలకమైన సూపర్ 4 తొలి పోరులో పాకిస్థాన్‌ను ఢీకొట్టనుంది. లీగ్ దశలో పాక్‌ను చిత్తు చేసిన సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) సేన మరోసారి అదే ఫలితాన్ని రాబట్టాలనే కసితో ఉంది. మరోవైపు షేక్‌హ్యాండ్ వ్యవహారంపై పెద్ద రాద్దాంతం చేసి.. చివరకు తోకముడిచిన పాక్ జట్టు కనీస పోరాటంతో టీమిండియాను నిలువరించాలని అనుకుంటోంది.
మెగా టోర్నీలో రెండో దశ అయిన సూపర్ 4 మ్యాచ్‌లకు సెప్టెంబర్ 20 నుంచి తెరలేవనుంది. ఇంతవరకూ గ్రూప్ దశలోని జట్లతో మాత్రమే ఆడిన టీమిండియా ఈ స్టేజిలో గ్రూప్ ‘బీ’లోని జట్లతోనూ తలపడనుంది. ముందుగా పాక్, ఆపై బంగ్లాదేశ్, చివరగా శ్రీలంకతో సూర్యకుమార్ సేన అమీతుమీ తేల్చుకోనుంది.
The match-day is upon us! 👏
It’s time for #INDvOMA & #TeamIndia is 𝙍𝙀𝘼𝘿𝙔 👌
Let’s GO! 🙌 🙌#AsiaCup2025 pic.twitter.com/ZeFaFTf8Nf
— BCCI (@BCCI) September 19, 2025
సెప్టెంబర్ 20 శనివారం : శ్రీలంక vs బంగ్లాదేశ్ – సాయంత్రం 6:30 గంటలకు (భారత కాలమానం ప్రకారం రాత్రి 8:30 గంటలకు), దుబాయ్‌లోని ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం.
సెప్టెంబర్ 21 ఆదివారం : భారత్ vs పాకిస్థాన్ – సాయంత్రం 6:30 గంటలకు (భారత కాలమానం ప్రకారం రాత్రి 8:30 గంటలకు), దుబాయ్‌లోని ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం.
సెప్టెంబర్ 23 మంగళవారం : పాకిస్థాన్ vs శ్రీలంక – సాయంత్రం 6:30 గంటలకు (భారత కాలమానం ప్రకారం రాత్రి 8:30 గంటలకు), అబూదాబీలోని షేక్ జయెద్ స్టేడియం.
సెప్టెంబర్ 24 బుధవారం : భారత్ vs బంగ్లాదేశ్ – సాయంత్రం 6:30 గంటలకు (భారత కాలమానం ప్రకారం రాత్రి 8:30 గంటలకు), దుబాయ్‌లోని ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం.
సెప్టెంబర్ 25 గురువారం : పాకిస్థాన్ vs బంగ్లాదేశ్ – సాయంత్రం 6:30 గంటలకు (భారత కాలమానం ప్రకారం రాత్రి 8:30 గంటలకు), దుబాయ్‌లోని ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం.
సెప్టెంబర్ 26 శుక్రవారం : భారత్ vs శ్రీలంక – సాయంత్రం 6:30 గంటలకు (భారత కాలమానం ప్రకారం రాత్రి 8:30 గంటలకు), దుబాయ్‌లోని ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం.