ఈ ఏడాది టీమిండియా విపరీతమైన బిజీగా గడపనుంది. విండీస్‌తో టీ20, వన్డే సిరీస్ ముగించుకున్న వెంటనే శ్రీలంకతో సిరీస్‌కు సన్నద్ధమవుతున్న టీమిండియా.. లంకేయులతో మూడు టీ20లు, రెండు టెస్టులు ఆడనుంది. ఆ వెంటనే రెండు నెలల పాటు రిచ్ లీగ్ ఐపీఎల్ ప్రారంభం అవుతుంది. ఈసారి ఐపీఎల్లో 10 జట్లు తలపడనున్న సంగతి తెలిసిందే. ఈ టీ20 లీగ్ ముగిసిన తర్వాత భారత జట్టు.. స్వదేశంలో సౌతాఫ్రికాతో తలపడుతుంది.
ఈ రెండు జట్ల మధ్య ఐదు టీ20 మ్యాచులు జరుగుతాయి. ఇవి ముగిసిన వెంటనే భారత బృందం.. ఇంగ్లండ్ బయలుదేరుతుంది. గత పర్యటనలో అర్ధంతరంగా రద్దయిన టెస్టును టీమిండియా ఈసారి ముగిస్తుంది. ఇదే సమయంలో ఐర్లాండ్‌తో ఒక టీ20 మ్యాచ్ కోసం సన్నాహాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఆ వెంటనే మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్ జరుగుతుంది.
ఇది ముగిసిన వెంటనే వెస్టిండీస్, జింబాబ్వే పర్యటనలకు టీమిండియా వెళ్లనుందని వార్తలు వస్తున్నాయి. ఆ తర్వాత యూఏఈలో జరిగే ఆసియా కప్‌లో పాల్గొంటుంది. అక్టోబరు 16 నుంచి టీ20 ప్రపంచకప్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఇంత బిజీ షెడ్యూల్లో బయో బబుల్ అలసల కీలకం కానుందని జట్టు మేనేజ్మెంట్ భావిస్తోంది. అందుకే 35 మంది ఆటగాళ్లతో పెద్ద బృందాన్ని రెడీ చేసి.. రెండు జట్లను రంగంలోకి దింపాలని టీమ్ మేనేజ్మెంట్ ఆలోచిస్తోందట.
గతేడాది సీనియర్ల టీం ఇంగ్లండ్ పర్యటనలో ఉండగా.. యువ ఆటగాళ్లతో ఉన్న జట్టును లంక టూర్‌కు బీసీసీఐ పంపిన సంగతి తెలిసిందే. ఇలాగే ఐర్లాండ్, జింబాబ్వే టూర్లకు ప్రధాన జట్టును కాకుండా యువజట్టును పంపాలని జట్టు మేనేజ్మెంట్ భావిస్తోందని సమాచారం. మరి దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తర్వాతే తెలుస్తుంది.