ODI World Cup | నిర్ణీత 50 ఓవర్లు పూర్తయ్యే సరికి న్యూజిలాండ్ 273 పరుగులకే ఆలౌట్ అయింది. భారత్ మందు 274 పరుగుల విజయ లక్ష్యాన్ని నిలిపింది. వన్ డౌన్ బ్యాట్స్ మన్ డెరిల్ మిచెల్ 126 పరుగులతో జట్టు మెరుగైన స్కోర్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. డెరిల్ మిచెల్ 130, రచిన్ రవీంద్ర 75 పరుగులు మినహా మిగతా బ్యాటర్లు క్రీజ్ లో నిలవలేకపోయారు. భారత్ బౌలర్లలో మహ్మద్ షమీ అత్యధికంగా ఐదు, కుల్దీప్ యాదవ్ రెండు, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ చెరో వికెట్ తీశారు.
ప్రారంభంలోనే ఓపెనర్ల రూపంలో రెండు వికెట్లు కోల్పోయిన కివీస్ బ్యాటర్లు రచిన్ రవీంద్ర, డెరిల్ మిచెల్ ఆచితూచి ఆడుతూ జట్టుస్కోర్ పెంచడానికి ప్రయత్నించారు. మూడో వికెట్ భాగస్వామ్యానికి 150 పరుగులు జత చేశారు. భారత్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తున్నా క్రమంగా సింగిల్స్ తీస్తూ.. వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు, సిక్సర్లు బాదుతూ జట్టు స్కోర్ పెంచుతున్నారు.
అంతకుముందు పిచ్ స్పిన్నర్లకు బౌన్స్ అవుతుండటంతోపాటు మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ బౌలింగ్‌ను ఎదుర్కోవడంలో కివీస్ బ్యాటర్లు తడబడ్డారు. వరల్ కప్ టోర్నీ చరిత్రలో 32 వికెట్లు తీయడం ద్వారా మహ్మద్ షమీ ఇంతకుముందు ఉన్న అనిల్ కుంబ్లే (32) రికార్డును అధిగమించాడు.