న్యూఢిల్లీ: టీమ్ఇండియా స్టార్ స్పీడ్‌స్టర్ మహమ్మద్ సిరాజ్ పలు ఆసక్తికర అంశాలలను అభిమానులతో పంచుకున్నాడు. ఇటీవలి ఇంగ్లండ్ టెస్టు సిరీస్‌తో పాటు కెరీర్ తొలినాళ్లలో ఎదురైన చేదు అనుభవాలు, కెప్టెన్ గిల్ మద్దతు, సోషల్‌మీడియాలో ట్రోలింగ్ లాంటి వాటిపై మాట్లాడాడు. ‘కెరీర్ మొదట్లో అప్పటి టీమ్ఇండియా కెప్టెన్ ధోనీ ఇచ్చిన సలహాలు, సూచనలు బాగా పనిచేశాయి. మెరుగ్గా రాణిస్తే మెచ్చుకునేవాళ్లే..విఫలమైనప్పుడు తీవ్ర విమర్శలు చేస్తారన్న ధోనీ మాటలు నమ్మాను.
ఇతరులు ఏమంటున్నారో అసలు పట్టించుకోవద్దు. బాగా ఆడినప్పుడు ప్రపంచం మొత్తం నీతోనే ఉంటుంది, అదే ఫెయిల్ అయితే వెళ్లి మీ నాన్నతో కలిసి ఆటో తోలుకో అన్న వాళ్లు ఉన్నారు. ధోనీ చెప్పినట్లు సోషల్‌మీడియాను ఫాలో కావడం పూర్తిగా మానేశాను. ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో సత్తాచాటాడం ఆత్మవిశ్వాసాన్నిచ్చింది. బుమ్రా గైర్హాజరీలో జట్టు బౌలింగ్ భారాన్ని మోశాను. లార్డ్స్ టెస్టు ఓటమి తీవ్ర మనోవేదనకు గురి చేసినా..ఓవల్ విజయం అది మరిచిపోయేలా చేసింది’ అని సిరాజ్ పేర్కొన్నాడు.