ఇండియా, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న 4వ టెస్ట్ మ్యాచ్.. సెకండ్ ఇన్నింగ్స్‌ను భారత్ ముగించేసింది. సెకండ్ ఇన్నింగ్స్‌లో భారత్ 466 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఇంగ్లండ్‌కు 368 పరుగుల లక్ష్యాన్ని అందించింది. అయితే.. భారత్‌ను రోహిత్ శర్మ, శార్దూల్ ఠాకూర్, రిషభ్ పంత్ ఆదుకున్నారు.
రోహిత్ శర్మ.. 127 పరుగులు చేయగా.. శార్దూల్ 60 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. రిషభ్ పంత్.. 50 పరుగులు చేసి ఔట్ అయ్యారు. పుజారా కూడా 61 పరుగులు చేసి భారత్‌కు పరుగులు అందించాడు. ఈ సిరీస్‌లో రెండు హాఫ్ సెంచరీలు చేసి రికార్డు సృష్టించాడు. ఉమేశ్ యాదవ్ 25 పరుగులు చేసి.. పెవిలియన్ చేరడంతో భారత్ ఆల్ఔట్ అయింది.
భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 191 పరుగులు చేసింది. సెకండ్ ఇన్నింగ్స్‌లో 466 పరుగులు చేసింది. రెండు ఇన్నింగ్స్ పరుగులు కలిపితే 657 పరుగులు. ఇంగ్లండ్ ఫస్ట్ ఇన్నింగ్స్ పరుగులు 290. అంటే.. ఇంకా 368 పరుగులను సెకండ్ ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ ఛేదించాల్సి ఉంది.
ఇక.. భారత్ నిర్దేశించిన 368 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడం కోసం.. ఇంగ్లండ్ బరిలోకి దిగింది. ఒక ఓవర్ ముగియగానే.. భారత ఆటగాళ్లు.. రోహిత్ శర్మ, పుజారాకు గాయాలయ్యాయి. దీంతో.. వాళ్లు ఫీల్డింగ్ నుంచి తప్పుకున్నారు.
Innings Break!#TeamIndia set a massive target of 368 runs for England.
— BCCI (@BCCI) September 5, 2021
Scorecard – https://t.co/OOZebPnBZU #ENGvIND pic.twitter.com/5hlSD9nCYa
UPDATE – Rohit Sharma and Cheteshwar Pujara will not take the field. Rohit has discomfort in his left knee while Pujara has pain in his left ankle. The BCCI Medical Team is assessing them. #ENGvIND pic.twitter.com/ihMSUPR7Im
— BCCI (@BCCI) September 5, 2021