Team India | వామ్మో ఇదేం చలి.. వణుకుతూనే భారత క్రికెటర్ల ప్రాక్టీస్.. వీడియో
Team India : దక్షిణాఫ్రికా పర్యటనకు విజయంతో ముగించిన భారత జట్టు(Team India) స్వదేశంలో మరో సమరానికి సిద్ధమైంది. మొహాలీ వేదికగా అఫ్గనిస్థాన్(Afghanistan)తో గురువారం రాత్రి 7:30 గంటలకు తొలి టీ20 మ్యాచ్ ఆడనుంది. అయితే.. ఈ మ్యాచ్ కోసమని ఉదయాన్నే ప్రాక్టీస్‌కు వెళ్లిన భారత క్రికెటర్లకు..
Team India : దక్షిణాఫ్రికా పర్యటనకు విజయంతో ముగించిన భారత జట్టు(Team India) స్వదేశంలో మరో సమరానికి సిద్ధమైంది. మొహాలీ వేదికగా అఫ్గనిస్థాన్(Afghanistan)తో గురువారం రాత్రి 7:30 గంటలకు తొలి టీ20 మ్యాచ్ ఆడనుంది. అయితే.. ఈ మ్యాచ్ కోసమని ఉదయాన్నే ప్రాక్టీస్‌కు వెళ్లిన భారత క్రికెటర్లకు ఊహించిన పరిస్థితి ఎదురైంది. మొహాలీ స్టేడియమంతా పొగమంచుతో కమ్ముకుపోయింది.
పైగా చల్లని గాలులతో కూడిన వాతావరణం. దాంతో తలకు ఉన్ని క్యాప్, స్వెట్టర్లు ధరించి మైదానంలోకి దిగారు. అయినా సరే చలి ఎక్కువ ఉండడంతో మొహాలీ వెదర్‌పై సరదాగా జోకులు వేసుకున్నారు. అంత చలిలోనూ ప్రాక్టీస్ కొనసాగించారు.
Jacket 🧥 ON
Warmers ON
Gloves 🧤 ON #TeamIndia have a funny take on their “chilling” ❄️🥶 training session in Mohali. #INDvAFG | @IDFCFIRSTBank pic.twitter.com/rWeodTeDr2— BCCI (@BCCI) January 11, 2024
పంజాబ్ తరఫున దేశవాళీ క్రికెట్ ఆడిన అర్ష్‌దీప్ సింగ్, శుభ్‌మన్ గిల్ల మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. ‘కొంచెం వెచ్చగా అనిపిస్తోంది. అందుకనే నేను హాఫ్ స్లీవ్స్ వేసుకున్నా. అయితే.. ఇంకాస్త చల్లగా ఉంటే బాగుండేది’ అని అర్ష్‌దీప్ జోక్ చేయగా.. ‘నాకైతే అంత చలి లేదు బాబు’ అని గిల్ నవ్వుతూ బదులిచ్చాడు.
రోహిత్ శర్మ, రాహుల్ ద్రవిడ్, విక్రమ్ రాథోర్

ఆ కాసేపటికే ‘వామ్మో ఇక్కడ చాలా చలిగా ఉంది. ఉష్ణోగ్రత 7 డిగ్రీలు ఉందనుకుంటా. అందుకనే చేతుల్ని పాకెట్స్‌లో పెట్టుకున్నా’ అని గిల్ అన్నాడు. ఇక కోచ్ రాహుల్ ద్రవిడ్(Rahul Dravid) అయితే.. చలికి తట్టుకోలేక రెండు మూడు దుస్తులు వేసుకొని కనిపించాడు. ఇక్కడ చలి ఎక్కువుంది. బెంగళూరులో పెరిగిన నేను ఇక్కడ గడ్డకట్టుకుపోయేలా ఉన్నా అంటూ ద్రవిడ్ జోక్ వేశాడు.
Rahul Dravid’s confirmed Rohit Sharma & Yashasvi Jaiswal will open in the T20Is ✅
But who are all in the Rohit-Kohli-opening-combo camp? 🤔#INDvAFG #T20WorldCup pic.twitter.com/EOw1rWvjI2
— ESPNcricinfo (@ESPNcricinfo) January 11, 2024
టీ20 వలర్డ్ కప్ ముందు టీమిండియా ఆడబోయే ఏకైక టీ20 సిరీస్ అఫ్గనిస్థాన్తోనే. దాంతో, బీసీసీఐతో పాటు కోచ్, కెప్టెన్ రోహిత్ శర్మ ఈ సిరీస్‌ను ప్రతిష్ఠాత్మకంగా తీసుకోనున్నారు. వన్డే వరల్డ్ కప్ తర్వాత ఆస్ట్రేలియాను చిత్తుచేసిన టీమిండియా ఇప్పుడు మూడు టీ20ల్లో కాబూలీలను వైట్‌వాష్ చేయాలనే పట్టుదలతో ఉంది. అయితే.. 14 నెలల తర్వాత టీ20 జట్టులోకి వచ్చిన రన్ మెషీన్ విరాట్ కోహ్లీ తొలి మ్యాచ్‌కు దూరమైన విషయం తెలిసిందే. మరోవైపు అఫ్గనిస్థాన్ కెప్టెన్ రషీద్ ఖాన్ గాయం కారణంగా సిరీస్ నుంచి వైదొలిగాడు.
ఇవి కూడా చదవండి
- David Warner | బీబీఎల్‌లో తొలి మ్యాచ్.. హెలిక్యాప్టర్‌లో ఎంట్రీ ఇవ్వనున్న డేవిడ్ భాయ్
- Tanishaa Mukerji | గ్లామర్ డోస్ పెంచేసిన తనీషా ముఖర్జీ..
- Mudragada | జనసేనలోకి ముద్రగడ..? ఆయన కుమారుడు ఏమన్నారంటే..!
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

