Death Threat | రాజస్థాన్‌కు చెందిన ఓ మంత్రికి (Rajasthan Minister) హత్య బెదిరింపులు (Death Threat) వచ్చాయి. బీజేపీ హయాంలోని భజన్‌లాల్ శర్మ కేబినెట్లో గిరిజన శాఖ మంత్రిగా ఉన్న బాబులాల్ ఖరాడీని ( Babulal Kharadi) చంపేస్తామంటూ కొందరు వ్యక్తులు బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ మేరకు ఆయన్ను ఇన్‌స్టా ద్వారా బెదిరించారు.
ఈ బెదిరింపులపై మంత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మూడు రోజుల క్రితం ఈ బెదిరింపులు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. గిరిజనులను హిందూ మతంలోకి మారుస్తున్నారని ఆరోపిస్తూ మంత్రిని చంపేస్తానని గుర్తు తెలియని వ్యక్తి బెదిరించినట్లు చెప్పారు. ఈ మేరకు సదరు వ్యక్తిపై ఉదయ్‌పూర్‌లోని కొద్దా పోలీస్ స్టేషన్ (Kotda Police)లో ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు వెల్లడించారు. ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.
Also Read..
Canada: నిజ్జార్ హత్య కేసు.. కెనడాలో ముగ్గురు భారతీయుల అరెస్టు
Manipur | కల్లోల మణిపూర్.. మైతీ, కుకీల ఘర్షణతో రెండుగా చీలిన రాష్ట్రప్రజలు
Monkey | పసరు వైద్యం చేసుకున్న కోతి.. ఆకు పసరుతో గాయానికి స్వీయ చికిత్స!