పొట్టి ప్రపంచకప్ కోసం ఆస్ట్రేలియా వెళ్లిన భారత జట్టు.. తొలి పోరులో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ను ఎదుర్కొనేందుకు సిద్ధం అవుతోంది. మెల్బోర్న్లోని ఎంసీజీ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. దీనికోసం మెల్బోర్న్ చేరుకున్న భారత జట్టు.. అక్కడి గవర్నర్ లిండా డెస్సాను కలిసింది. దీనికి సంబంధించిన ఫొటోలను బీసీసీఐతోపాటు విక్టోరియా గవర్నర్ కూడా సోషల్ మీడియాలో పంచుకున్నారు.
‘ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్ కప్లో భారత జట్టు హోస్ట్ సిటీగా వారికి గవర్నమెంట్ భవనంలో స్వాగత కార్యక్రమం నిర్వహించాం’ అని ఈ ఫొటోలను షేర్ చేశారు. 2007లో తొలి ఎడిషన్ టీ20 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టు ఆ తర్వాత ఈ ట్రోఫీని ముద్దాడలేదు. గతేడాది ఫేవరెట్లుగా బరిలో దిగినప్పటికీ తొలి రెండు మ్యాచుల్లో చెత్త ప్రదర్శనతో గ్రూప్ దశలోనే ఇంటి దారి పట్టింది. ఈ క్రమంలో ఎలాగైనా ఈసారి కప్పు కొట్టాలని జట్టు కసిగా ఉంది.
As the host city for the Indian National Cricket Team during the ICC Men’s T20 World Cup, hosting a welcome reception this afternoon at Government House for the players and support staff @T20WorldCup @cgimelbourne @visitvictoria @BCCI pic.twitter.com/Wb1rruDY76
— Governor of Victoria (@VicGovernor) October 21, 2022
The Honourable Linda Dessau AC, the Governor of Victoria (@VicGovernor) and other dignitaries met the Indian Cricket Team today ahead of the #T20WorldCup. pic.twitter.com/ytTFt5GGQk
— BCCI (@BCCI) October 21, 2022