చందంపేట(దేవరకొండ), డిసెంబర్ 17 : దేవరకొండ డివిజన్లోని 9 మండలాల్లో బుధవారం పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. డివిజన్ పరిధిలోని దేవరకొండ, చందంపేట, నేరెడుగొమ్ము, గుండ్లపల్లి(డిండి), చింతపల్లి, కొండమల్లేపల్లి, పెద్దఅడిశర్లపల్లి, గుడిపల్లి, గుర్రంపోడు మండలాల్లోని 227 పంచాయతీలు, 1603 వార్డు పదవులకు పోలింగ్ జరిగింది. మొత్తం 2,206 పోలింగ్ కేం ద్రాలు ఏర్పాటు చేయగా 88.72 శాతం పోలింగ్ నమోదైంది.
అత్యధికంగా నేరెడుగొమ్ము మండలంలో 91.49 శాతంగా నమోదు కాగా, కొండమల్లేపల్లి మండలంలో తక్కువ (85.12) శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 2,28,135 మంది ఓటర్లు ఓటు వేయ గా వీరిలో 1,13,816 మంది పురుషులు, 1,14,310 మంది మహిళలు ఉన్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. కాగా డివిజన్లోని సమస్యాత్మక ప్రాంతాల్లో డీఐజీ చౌహాన్, ఎస్పీ శరత్చంద్ర పవార్ పర్యటించి, అధికారులకు సూచనలు చేశారు. పలు పోలింగ్ కేంద్రాల్లోని పోలింగ్ సరళిని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఎప్పటికప్పడు సమీక్షించారు.