ICC Champions Trophy | ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో టీం ఇండియా ఓపెనర్ శుభ్‌మన్ గిల్ ఔటయ్యాడు. 19వ ఓవర్లో మిచెల్ శాంత్నర్ వేసిన నాలుగో బంతిని ఎక్స్ట్రా కవర్ మీదుగా పంపేందుకు ప్రయత్నించి ఫిలిప్స్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ దారి పట్టాడు. దరిమిలా సారధి రోహిత్ శర్మతో కలిసి తొలి వికెట్ భాగస్వామ్యానికి 105 పరుగులు జత చేశాడు. మ్యాచ్‌లో బ్యాటింగ్ ప్రారంభించినప్పటి నుంచి రోహిత్ శర్మకు అవకాశమిస్తూ వచ్చిన శుభ్‌మన్ గిల్ ఔటయ్యే సమయానికి 31 పరుగులు చేశాడు. వాటిల్లో ఒక సిక్సర్ కూడా ఉంది.వన్‌డౌన్‌గా బ్యాటింగ్‌కు వచ్చిన విరాట్ కోహ్లీ కూడా మిచెల్ బ్రాస్‌వెల్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూ కావడంతో టీమ్ ఇండియా 106 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది.